చిరంజీవి ఆల్ టైమ్ రికార్డు..ఇది ఏ హీరోకు సాధ్యం కాలేదుగా!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఏ స్టార్ హీరోకు సాద్యం కాని ఆల్ టైమ్ వ‌ర‌ల్డ్ రికార్డును సృష్టించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమా మేజ‌ర్ షూటింగ్ మొత్తం పూర్తి అవ్వ‌గా.. ప్యాచ్‌వర్క్ ఈ డిసెంబర్‌లో పూర్తి చేయబోతున్నారట.

అలాగే చిరు ఇటీవ‌ల‌ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్‌` చిత్రాన్ని ఇటీవ‌ల ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళ హిట్ `లూసీఫర్‌`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార, బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, స‌త్య‌దేవ్‌లు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఇక ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్న‌ప్పుడే చిరు.. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో `భోళాశంకర్‌` చిత్రాన్ని, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో `మెగా154` పేరుతో ఓ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. అయితే విష‌యం ఏంటంటే.. ఈ నాలుగు చిత్రాలు డిసెంబ‌ర్ నెల‌లో షూటింగ్ జ‌రుపుకోబోతున్నాయి. దీంతో చిరంజీవి ఈ నాలుగు చిత్రాల షూటింగ్స్‌లోనూ పాల్గొన‌బోతున్నారు.

వాస్త‌వానికి ఓ స్టార్ హీరో ఇలా ఒకే నెలలో నాలుగు సినిమాల్లో నటించడం అసాధ్యం. కానీ, చిరంజీవి మాత్రం దాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నారు. దీంతో ఏక కాలంలో నాలుగు సినిమాల్లో న‌టిస్తున్న స్టార్ హీరోగా చిరు ఆల్‌టైమ్‌ వరల్డ్ రికార్డ్ ను సృష్టించాడు. ఈ నేప‌థ్యంలోనే చిరంజీవి పేరు సోష‌ల్ మీడియాలో మారుమోగిపోతోంది.

Share post:

Latest