నిహారిక‌కు ఎప్పుడు అదే పని..ఫొటోతో ఆ మ్యాట‌ర్ లీక్ చేసిన భ‌ర్త‌!

మెగా డాట‌ర్‌, నాగ‌బాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ‌.. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఈ సినిమా పెద్ద‌గా హిట్ అవ్వ‌క‌పోయినా న‌ట‌న ప‌రంగా నిహారిక మంచి మార్కుల‌నే వేయించుకుంది.

ఆ త‌ర్వాత హ్యాపి వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు చేసిన నిహారిక.. గ‌త ఏడాది డిసెంబర్ 9న వెంకట చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకంది. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ హోటల్‌లో నిహారిక, చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో వ‌రుస వెకేష‌న్ల‌కు వెళ్తున్న నిహారిక‌.. తాజాగా స్పెయిన్‌కు వెళ్లారు.

స్పెయిన్ లోని పర్యటక ప్రాంతాలను సందర్శిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఈ జంట‌.. ఎప్ప‌టిక‌ప్పుడు అందుకు సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇక తాజాగా అక్క‌డీ జంట డిన్నర్‌ చేయడానికి ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. అయితే నిహారిక తినకుండా తన ఫోన్‌లో బిజీగా ఉంది.

దీంతో నిహాను సెల్ఫీ తీస్తూ ‘ఎప్పుడు ఇదే పని, ప్రతి క్షణం​ ఫోన్‌లో బిజీగానే ఉంటుంది’ అంటూ చైత‌న్య ఇన్‌స్టా స్టోరీస్‌లో చెప్పుకొచ్చాడు. అలాగే ఆమె ఫోన్‌ చూస్తున్న మరో ఫొటోను కాసేపటికి మ‌ళ్లీ షేర్‌ చేస్తూ ‘కొన్నిమిలియన్‌ క్షణాల తర్వాత’ ఫన్నీ క్యాప్షన్‌ ఇచ్చాడు. మొత్తానికి వీరిద్ద‌రి అల్ల‌రి మాత్రం మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

 

Share post:

Popular