నానితో న‌టించాల‌నుందా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌!

న్యాచుర‌ల్ స్టార్ నానితో న‌టించాల‌నుందా..? ఒక్క‌సారైనా ఆయ‌నతో స్క్రీన్ షేర్ చేసుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో ఆరాట‌ప‌డుతున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. నాని ఇటీవ‌లె త‌న 29వ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంతో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రానికి `ద‌స‌రా` అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సింగరేణి నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా నాని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అద‌ర‌గొట్ట‌బోతున్నాడు. అయితే తాజాగా దసరా మేకర్స్‌ కాస్టింగ్‌ కాల్‌కు ఆహ్వానించారు.

తెలుగు మాట్లాడే నటీనటులు ఎంపిక కోసం సోష‌ల్ మీడియా ద్వారా ఓ ప్రకటన జారీ చేశారు. ఇందులో భాగంగా 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలు, 08 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న బాలబాలికలకు ఈ అవకాశం కల్పించారు. [email protected]కి వీడియోలు పంపించాలని తెలిపారు. అయితే టిక్‌టాక్‌ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్‌ పరిగణలోకి తీసుకోమంటూ స్పష్టం చేశారు. చివరి తేదీగా 31-12-2021గా నిర్ణయించారు.

న‌ట‌న‌పై ఆస‌క్తి ఉన్న తెలుగు రాష్ట్రాల నటీ, నటులు ఎవ్వ‌రైనా ఈ అవకాశాన్ని వినియోగించుకోవ‌చ్చు. కాగా, నాని ఇత‌ర సినిమాల‌ విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న న‌టించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం మ‌రో రెండు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అలాగే మ‌రోవైపు నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో `అంటే సుందరానికి` అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌స్తుతం సెట్స్ మీదే ఉంది.

Share post:

Latest