బుల్లెట్ బండి.. ఈ పాటకు వరుడిని ఉద్దేశించి పెళ్లి కూతురు చెప్పే మాటలను పాటల రూపంలో స్వరపరచడం జరిగింది. ఇకపోతే ఈ పాట విడుదల అయ్యి ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈ పాటకు సెలబ్రిటీలు మాత్రమే కాదు రాజకీయ నాయకులు కూడా పలు ఫంక్షన్ లలో స్టెప్పులేయడం మనం గమనించే ఉంటాం.ఆ మధ్య బరాత్‌లో బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా అనే ఓ ప్రైవేటు సాంగ్‌కి నవవధువు సాయిశ్రీయ స్టెప్పులేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనితో ఆమెకి వీపరితమైన క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌తో ఆమె ఏకంగా సెలబ్రిటీగా మారిపోయింది.
దీనితో ఆమె ఏ పాటకైతే డ్యాన్స్ చేసిందో ఆ పాటను నిర్మించిన సంస్థ.. తాము నిర్మించబోయే తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం కల్పించింది. త్వరలోనే సాయిశ్రీయ ప్రధాన పాత్రలో ఓ పాట రాబోతోంది. ఇదిలావుండగా ఆమెకి మరో బంపరాఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఓటీటీ వేదికగా మరో రెండు నెలల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రారంభంకానుంది. ఇందులో కంటెస్టెంట్స్ కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీగా మారిన సాయిశ్రీయను బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారని తెలుస్తోంది. బిగ్‌బాస్ లోకి వెళ్లేందుకు ఆమెకూడా ఒప్పుకున్నట్లు సమాచారం.