సమంత ఐటెం సాంగ్‌కి బ్రహ్మీ వర్షన్.. వీడియో చూస్తే న‌వ్వాగ‌దు!

లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబ‌ర్ 17న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది.

ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఐటెం సాంగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. `ఊ అంటవా మావ.. ఊఊ అంటావా మావ‌` అంటూ సాగే ఈ మాస్ మసాలా ఐటెం సాంగ్ ను ఇటీవ‌లె మేక‌ర్స్ విడుద‌ల చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించిన ఆ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించ‌గా, ఇంద్రావతి చౌహాన్‌ మాస్‌ వాయిస్‌తో ఆలపించారు.

మాస్‌ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్‌.. ప్ర‌స్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ఇలా రిలీజైందో లేదో నెటిజన్లు ఈ పాటను తెగ వాడేస్తూ రకరకాల ఎడిటింగ్‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ నెటిజ‌న్ `ఊ అంటావా.. ఊ ఊ అంటావా.. సాంగ్` ని ఎడిట్ చేసి బ్రహ్మానందం సినిమాలోని సీన్స్ తో ఓ వీడియో రూపొందించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దీంతో ఇప్ప‌డు సమంత ఐటెం సాంగ్‌కి బ్రహ్మీ వర్షన్ వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు న‌వ్వాపుకోలేక‌పోతున్నారు. అంత స‌ర‌దాగా ఈ వీడియో సాగింది. మ‌రోవైపు సదరు సాంగ్ పై రాక్ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ స్పందిస్తూ.. హిలేరియస్‌, సూపర్‌గా ఎడిట్‌ చేశారంటూ పొగడ్తల వర్షం కురిపించాడు.

Share post:

Popular