టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మాతమవుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది.
సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. సినిమా విషయాలు పక్కన పెడితే.. మహేష్ బాబు తాజాగా ఓ ఖరీదైన ఫ్లాటును కొనుగోలు చేశారట. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. యర్రం విక్రాంత్‌రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేశ్‌బాబు 1442 గజాల ప్లాటును కొనుగోలు చేశారట.
అందు కోసం మహేష్ బాబు రూ.26 కోట్లు వెచ్చించారు. ఇందులో స్టాంప్ డ్యూటీ కింద రూ.1.43 కోట్లు, ట్రాన్స్ఫర్ డ్యూటీ కింద రూ.39 లక్షలు చెల్లించారట. ఈ ఏడాది నవంబర్లోనే కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యింది. అయితే ఈ ఫ్లాటు కొనుగోలుపై మహేష్ బాబు నుంచి ఎటువంటి అధికారిక స్పందన లేకపోయినా.. నెట్టింట మాత్రం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
కాగా, ఓవైపు వరుస సినిమాలు చేస్తున్న మహేష్ బాబు.. మరోవైపు పలు బిజినెస్‌లు చేస్తూ వ్యాపారవేత్తగానూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏఎంబీ సినిమాతో పాటు టెక్స్టైల్ బ్రాండ్ స్టార్ట్ చేసిన మహేష్.. పలు ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు.