సూప‌ర్ ట్విస్ట్‌..బిగ్‌బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ అత‌డే.. తేల్చేసిన స‌ర్వేలు..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో గ్రాండ్‌గా ఈ షో ప్రారంభం కాగా.. ఇప్పుడు మాన‌స్‌, శ్రీ‌రామ్‌, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, స‌న్నీ, సిరిలు ఫినాలేలో అడుగు పెట్టారు. బిగ్ బాస్ సీజ‌న్ 5 ఫైన‌ల్ ఎపిసోడ్ డిసెంబర్‌ 19న జరగబోతుంది. ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు అందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సారి బిగ్‌బాస్ సీజ‌న్ 5 ట్రోపీని గెలుచుకోబోయే విన్న‌ర్‌కు రూ.50 ల‌క్ష‌లు ప్రైస్ మ‌నీతో పాటుగా షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల స్థలాన్ని సైతం ఇవ్వ‌బోతున్నారు. ప్ర‌స్తుతం టాప్ 5 కంటెస్టెంట్ల జర్నీ వీడియోలతో షోను లాగించేస్తారు. మ‌రోవైపు ఈ సీజ‌న్ విన్న‌ర్ అయ్యేది ఎవ‌రు అన్న‌ది ఉత్క‌ఠ‌భ‌రితంగా మారింది.

అయితే మొద‌టి నుంచీ సింగ‌ర్ శ్రీ‌రామ్‌నే విజేత అవుతాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అత‌డి ఆట‌తీరు, మాట‌తీరు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. అత‌డికి బ‌య‌ట‌కు భారీ ఫాలోయింగ్ ఉంది. పైగా ప‌లువురు సెల‌బ్రెటీలు సైతం శ్రీ‌రామ్‌కు స‌పోర్ట్ చేశారు. దీంతో ఈసారి ట్రోపీ అత‌డితే అంటూ వార్త‌లు వ‌చ్చాయి.కానీ, ఇప్ప‌డు సూప‌ర్ ట్విస్ట్ నెల‌కొంది. టైటిల్ రేస్‌లో అంద‌రి కంటే ముందు స‌న్నీ దూసుకుపోతున్నాడ‌ట‌.

ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అందరి మొహంపై నవ్వు తీసుకొచ్చే ఎంటర్టైనర్‌గా అందరి మదిలోనూ చెరగని ముద్ర వేసుకున్న‌డు స‌న్నీ. ఈ నేప‌థ్యంలోనే షణ్ముఖ్ జస్వంత్, సిరి, మానస్, శ్రీరామ్‌ల కంటే స‌న్నీకే ఓట్లు ఎక్కువ ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. ప‌లు స‌ర్వేలు కూడా స‌న్నీనే విన్న‌ర్ అంటూ తేల్చేశాయి. ఇక బిగ్‌బాస్ సైతం జ‌ర్నీ వీడియో విష‌యంలోనూ స‌న్నీకే ఎక్కువ హైప్ ఇచ్చారు. దీంతో స‌న్నీనే బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర‌ని అంటున్నారు.

Share post:

Latest