`పుష్ప‌`రాజ్‌గా మారిన బాల‌య్య‌..వీడియో చూస్తే విజిల్స్ వేయాల్సిందే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 17న విడుద‌లై.. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో బ‌న్నీ పుష్ప‌రాజ్‌గా వ‌న్ మ్యాన్ షో చేశాడు.

- Advertisement -

ముఖ్యంగా `త‌గ్గేదే లే..` అంటూ పుష్ప‌రాజ్ చెప్పిన డైలాగ్ సినీ ప్రియులంద‌రినీ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటారు. అయితే ఇప్పుడు న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ పుష్ప‌రాజ్ మారాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాల‌య్య ప్ర‌స్తుతం ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్ర‌సారం అవుతున్న `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే తాజాగా ఈ షోలో పుష్ప టీమ్(ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్, రష్మిక మందన్నా) వ‌చ్చి సంద‌డి చేసింది. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య బ‌న్నీతో క‌లిసి `పుష్పరాజ్` పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. అంతే కాదు, `పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్.. తగ్గేదే లే..` అంటూ తమదైన శైలిలో డైలాగ్ చెప్పి ప్రేక్ష‌కుల చేత విజిల్స్ వేయించారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. ఇక పుష్ప‌రాజ్‌గా మారిన బాల‌య్య‌ను చూసి నంద‌మూరి అభిమానులు తెగ ముసిరిపోతున్నారు. బాల‌య్యకు సాధ్యం కానిది ఏమీ లేదంటూ ఆయ‌న‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Share post:

Popular