బాలయ్య జోష్..షార్ట్ గ్యాప్ లో మళ్లీ సెట్ లోకి..!

అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో బాలయ్య మాంచి జోష్ మీద కనిపిస్తున్నారు. అఖండ సినిమా వచ్చిన తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ,బోయపాటి శ్రీనివాస్ సినిమా సూపర్ హిట్ కావడంతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తిలో ముక్కంటిని, తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.బాలకృష్ణ ఇదే జోష్ తో మరో సినిమాను ప్రారంభించనున్నాడు.

బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ఇటీవల పూజ కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మేకర్స్ సన్నాహాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. క్రాక్ వంటి యాక్షన్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని బాలకృష్ణతో సినిమా చేస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

మాంచి మాస్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కనుంది.ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత బాలకృష్ణ -అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ -వరుణ్ తేజ్ హీరోలుగా ఎఫ్3 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బాలయ్య అనిల్ కాంబినేషన్లో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఆలోపు బాలయ్య గోపిచంద్ మలినేని సినిమాను పూర్తి చేసే అవకాశం ఉంది.

Share post:

Popular