అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: పుష్ప – ది రైజ్
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, తదితరులు
సినిమాటోగ్రఫీ: మీరోస్లావ్ కూబా బ్రోజెక్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్
రిలీజ్ డేట్: 17-12-2021

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం ప్రేక్షకులు గత రెండేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు థియేటర్లకు జనం వస్తుండటంతో ఈ సినిమాను నేడు ప్రపంచవ్యా్ప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో బన్నీ నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ‘పుష్ప’పై ముందునుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఇప్పటికే భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకోవడంతో పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నేడు రిలీజ్ అయిన పుష్ప ప్రేక్షకుల అంచనాలను ఎంతమేర అందుకున్నాడో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా కథను స్టార్ట్ చేశాడు దర్శకుడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాను పట్టుకునేందుకు కొత్తగా గోవిందప్ప(హరీష్ ఉత్తమన్) అనే పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. అయితే ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను కొండారెడ్డి బ్రదర్స్ గుట్టుచప్పుడు కాకుండా అక్కడి జనంతో చేయిస్తుంటారు. ఈ క్రమంలో కొండారెడ్డి బ్రదర్స్ వద్ద పనిలో చేరుతాడు పుష్ప. అతడికి శ్రీవల్లి(రష్మిక) అంటే చాలా ఇష్టం. ఆమెను అతడు ప్రేమిస్తుంటాడు. అయితే కొండారెడ్డి ముఠాకు మంగళం శ్రీను(సునీల్) విరోధిగా ఉంటాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాగే వైరం ఎటువైపు వెళ్తుంది..? ఇంతకీ పుష్ప ఎర్రచందనం స్మగ్లింగ్‌లో లారీ డ్రైవర్ నుండి డాన్‌గా ఎలా ఎదిగాడు..? అతడి ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? శ్రీవల్లితో అతడి ప్రేమ సక్సెస్ అవుతుందా? ఇంతకీ భన్వర్ సింగ్ ఎవరు? అనేది ఈ సినిమా కథ.

విశ్లేషణ:
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసినప్పటినుండే ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఈ సినిమాపై వారు పెట్టుకున్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు సుకుమార్. ఇక ఈ సినిమా కథనం గురించి చెప్పుకుంటే.. ఫస్టాఫ్‌లో శేషాచలంలో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి వివరిస్తూనే, అక్కడి జనం తాలుకా బతుకులను మనకు చూపించారు. ఈ క్రమంలో హీరో చిన్నతనంలో ఎలా ఉండేవాడు.. పెద్దయ్యాక ఈ స్మగ్లింగ్ ముఠాలో ఎందుకు చేరుతాడు అనేది చూపించారు. అయితే శ్రీవల్లిని ప్రేమించే పుష్పరాజ్ ఆమెకోసం ఏం చేస్తాడు అనేది చూపించారు. ఇక ఈ క్రమంలో జరిగే యాక్షన్ సీక్వెన్స్, చేజింగ సీన్స్‌తో ఫస్టాఫ్‌ను ఇంటర్వెల్ వరకు లాక్కొచ్చారు. ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్‌తో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై ఆసక్తిని మరింత పెంచుతుంది.

ఇక సెకండాఫ్‌లో మంగళం శ్రీనుపై పగపెంచుకున్న పుష్పరాజ్, అతడిని ఎలా ఢీకొంటాడు అనేది మనకు చూపించారు. ఈ క్రమంలో జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్‌తో సెకండాఫ్ కాస్త గాడి తప్పినట్లు కనిపిస్తుంది. ఇక ప్రీక్లైమాక్స్‌లో పుష్పరాజ్ ప్రేమ సక్సెస్ కావడం, అతడు స్మగ్లింగ్ సామ్రాజ్యానికి కింగ్‌గా మారడం, అప్పుడే భన్వర్ సింగ్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇవ్వడంతో పుష్ప – ది రైజ్ తొలి భాగాన్ని ముగంచేశారు. ఈ సినిమా రెండో భాగంలో పుష్పరాజ్ వర్సెస్ భన్వర్ సింగ్ కథను మనకు చూపించబోతున్నట్లు ఇప్పటికే చిన్నపాటి క్లూ కూడా ఇచ్చేశారు చిత్ర యూనిట్.

ఇలా ఓవరాల్‌గా చూస్తే ఓ కామన్ లైన్‌తో వచ్చిన పుష్ప చిత్ర కథకు మాస్ అంశాలను జోడిస్తూ, హీరో ఎలివేషన్స్, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లను యాడ్ చేసి పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు బాగుంది. మొత్తానికి ముందునుండీ చెబుతున్నట్లుగానే ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
పుష్ప రాజ్ పాత్ర కోసం బన్నీ మేకోవర్, అతడి బాడీ లాంగ్వేజ్ కోసం ఆయన పడ్డ కష్టం మనకు తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. చిత్తూరు యాసలో బన్నీ చెప్పే డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఇక డీగ్లామర్ పాత్రలో హీరోయిన్ రష్మిక మందన కూడా సూపర్బ్‌గా చేసింది. ఈసారి ఎలాంటి ఓవర్ యాక్షన్‌కు స్కోప్ ఇవ్వకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నించింది. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మంగళం శ్రీను పాత్ర గురించి. కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్, ఇప్పుడు అసలుసిసలైన విలన్ పాత్రలో కుమ్మేశాడు. ఈ పాత్రలో ఆయన గెటప్, ఆయన చెప్పే డైలాగ్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఇక ఊ అంటావా మావా అంటూ హాట్ అందాలతో సమంత ఈ సినిమాకు మేజర్ అట్రాక్షన్‌గా నిలిచింది. అటు దాక్షాయని పాత్రలో అనసూయ భరద్వాజ్ నటన కూడా బాగుంది. చివర్లో వచ్చే ఫహద్ ఫాజిల్ ఎంట్రీ పీక్స్ అని చెప్పాలి. అతడి లుక్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. మిగతా నటీనటులు తమ పరిధిమేర బాగా నటించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
ఓ సింపుల కథను ప్రేక్షకులకు సరికొత్తగా ప్రెజెంట్ చేయడంలో తాన ఎంతటి ధిట్ట అనేది మరోసారి పుష్ప చిత్రంతో ప్రూవ్ చేశాడు దర్శకుడు సుకుమార్. ఎర్రచందనం స్మగ్లింగ్ గురించిన కొన్ని తెలియని విషయాలను కూడా ఆయన ఈ సినిమాలో చూపించాడు. ఇక ఈ సినిమాను తనదైన మార్క్ టేకింగ్‌తో ఎక్కడా సైడ్ ట్రాక్ కాకుండా చాలా బాగా ప్రెజెంట్ చేసి ప్రేక్షకులను మెప్పించాడు ఈ స్టార్ డైరెక్టర్. అటు సినిమాటోగ్రఫీ పనితనం కూడా ఈ సినిమాకు మేజర్ అసెట్. అడవి నేపథ్యంలో సాగే కథ అయినా ప్రతి ఫేంను చాలా చక్కగా చూపించారు. ఇక ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిన అంశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతమే. ఆయన ట్యూన్ చేసిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్స్ కాగా, ఈ సినిమాలో ఆయన ఇచ్చిన బీజీఎం కూడా సూపర్బ్‌గా ఉంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
పుష్ప – రొటీన్ సినిమాకు హైప్ తేవడంలో తగ్గేదే లే..!

రేటింగ్:
2.75/5.0

Share post:

Latest