టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తొలిసారి ఐటెం భామగా మారి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. `ఊ అంటవా మావ.. ఊఊ అంటావా మావ` అంటూ సాగే ఈ మాస్ మసాలా ఐటెం సాంగ్‌లో ఇంద్రావతి చౌహాన్ వాయిస్, చంద్రబోస్ లిరిక్స్, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత సూపర్ స్టెప్పులు ఇలా అన్నీ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సాంగ్ విడుదలైన దగ్గర నుంచీ మిలియన్స్ వ్యూస్‌తో నెట్టింట దూసుకుపోతోంది. అలాగే ఈ సాంగ్‌పై పలు వివాదాలు కూడా చెలరేగాయి.
ఈ విషయాలు పక్కన పెడితే.. తాజాగా ఈ సాంగ్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్, పాన్ ఇండియా ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవిలు సైతం స్టెప్పులేశారు. తన సినిమా కాబట్టి అల్లు అర్జున్ స్టెప్పేయడంలో పెద్ద వింతేమి లేదు. మరి మిగిలిన వాళ్లు డ్యాన్స్ చేయడం ఏంటా.. అని ఆలోచిస్తున్నారా..? అక్కడికే వస్తున్నా .ఆగండీ..
క్రియేటివిటీ వీరులు సామ్ సాంగ్ విడుదలైనప్పటి నుంచీ రకరకాలుగా ఎడిటింగ్‌లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ వ్యక్తి ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ అనే లిరిక్స్‌నే తీసుకొని ‘ఊ అంటావా పాప ఊఊ అంటావా పాప’ అని మార్చేశారు. అంతేకాదు సమంత డాన్స్ చేసిన ఈ పాటకు పవన్, ప్రభాస్, మహేష్, చరణ్, చిరు నటించిన సినిమాల్లోని డ్యాన్స్ క్లిప్స్‌తో ఎడిటింగ్‌లు చేసి `ఊ అంటవా మావ.. ఊఊ అంటావా మావ` సాంగ్‌కి మేల్ వర్షెన్ అంటూ నెట్టింట ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఫుల్ కామెడీగా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అయిపోతోంది.
https://twitter.com/vaaalisugreeva/status/1470944433306841092?s=20