అఖండ సినిమా పై పబ్లిక్ రివ్యూ ఎలా ఉందంటే..?

నందమూరి బాలకృష్ణ మూడు వరుస ఫ్లాపుల సినిమాల తర్వాత.. విడుదలైన తాజా చిత్రం అఖండ. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500 పైగా థియేటర్లలో ఈ రోజున విడుదలైంది. ఇక అద్భుతమైన టాక్ తో ఈ సినిమా నడుస్తోంది. అయితే ఇప్పుడు పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

- Advertisement -

ఒక అభిమాని థియేటర్ బయట అఖండ మూవీ చూశాను.. కాలరెగరేసి చెబుతున్నాను బ్లాక్ బస్టర్ గా నిలబడుతుందని తెలియజేశారు. మరొక అభిమాని ఫైట్లు మామూలుగా లేవు.. గుద్దితే గోడలు పగిలిపోతాయి అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే కొంత మంది నెటిజన్లు మాత్రం బాలయ్య ఈ ఏజ్ లో కూడా ఇంతటి పర్ఫామెన్స్ ఇవ్వడం చాలా అద్భుతంగా ఉంది అంటూ తెలియజేశారు. ఇక ఈ సినిమా ఇంటర్వెల్ సీన్స్ కోసం వంద సార్లు అయినా సినిమాకి వెళ్ళవచ్చు అని తెలియజేశారు. ఇందులో జగపతిబాబు,బాలయ్య, శ్రీకాంత్ పోటీపడి నటించారని తెలియజేశారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ డాన్స్ తో ఆకట్టుకుందని తెలియజేశారు.

ఈ సినిమా ఈ ఏడాది థియేటర్లలో దద్దరిల్లిపోవడం ఖాయమంటూ మరికొంతమంది ఆడియన్స్ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ల విషయంపై జగన్మోహన్ రెడ్డి రేట్లు తగ్గించినప్పటికీ ప్రేక్షకులు బాగానే థియేటర్ వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా అఖండ ప్రీమియర్ షోకి కొన్నిచోట్ల 4000 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా ఎంతటి కలెక్షన్లు రాబడుతోంది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share post:

Popular