త్రివిక్రమ్ పై.. పొగడ్తలు వర్షం కురిపించిన రామ జోగయ్య శాస్త్రి..!

డైరెక్టర్ త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున భీమ్లా నాయక్ సినిమా నుండి లాలా భీమ్లా అనే పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ పాటలు తిక్క లిరిక్స్ రాయడం గమనార్హం. రచయిత రామజోగయ్య శాస్త్రి గారు ఈ మేరకు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

వాట్ ఏ రైటింగ్ త్రివిక్రమ్ గారు అంటూ, పది పడగల పాము పైన పాడమేడితే సామి తోడు, పిడుగులోచ్చి మీద పడితే కొండ గొడుగు నెత్తినోడు లాలా భీమ్లా… ఫుల్ మీల్స్ అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా వేదిక గా రామ జోగయ్య శాస్త్రి చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దగ్గుపాటి రానా, నిత్యా మీనన్ సంయుక్త ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ విధమైన పోస్టర్ గాని, వీడియో కాని విడుదల అయితే బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా థమన్ వహిస్తున్నాడు.ఇక ఈ సినిమాకి డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు రాయడం విశేషం. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.