నేడు ఎన్టీఆర్‌కి వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌..ఎందుకో తెలుసా?

నందమూరి నట వారసుడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్ తోనే టాలీవుడ్‌లో త‌న‌కంటూ సెపరేట్ ఇమేజ్‌ ఏర్ప‌ర్చుకున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్‌కి నేడు వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌.

Did you know how much Jr NTR was paid for his debut film ''Ninnu Choodalani''? | Telugu Movie News - Times of India

ఎందుకంటే, హీరోగా ఎన్టీఆర్‌ కెమెరా ముందుకు వచ్చి 21ఏళ్ల పూర్తైయింది. `బ్రహ్మర్షి విశ్వామిత్ర` చిత్రంలో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఈయ‌న‌.. ఆ త‌ర్వాత‌ తరువాత `బాల రామాయణము` చిత్రంలో రాముడిగా నటించాడు. అయితే హీరోగా మాత్రం 2001లో `నిన్ను చూడాలని`తో టాలీవుడ్ తెరంగేట్రం చేశాడు.

Did you know how much Jr NTR was paid for his debut film ''Ninnu Choodalani''? | Telugu Movie News - Times of India

ఈ సినిమా షూటింగ్ సరిగ్గా 21 యేళ్ల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో ఇదే రోజే ప్రారంభమైంది. అలా హీరోగా ఎన్టీఆర్‌.. తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. అందుకే, ఎన్టీఆర్‌కి ఈ రోజు ఎంతో స్పెష‌ల్ డే అని అంటుంటారు. ఇక ఈ సినిమా పెద్ద‌గా ఆడకపోయినా.. ఆ త‌ర్వాత ఎన్టీఆర్‌-రాజ‌మౌళి కాంబోలో వ‌చ్చిన `స్టూడెంట్ నెం.1` చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

Share post:

Latest