బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిది వారాలు పూర్తైయ్యాయి. మొత్తం 19తో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియ మరియు లోబోలు ఎనిమినేట్ కాగా.. ఇంకా 11 మందే హౌస్లో మిగిలారు.
ఇక నేడు సోమవారం. నామినేషన్ల కార్యక్రమంతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మరోవైపు బిగ్ బాస్ ప్రియులు సైతం ఎవరెవరు నామినేట్ అవుతారా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
అయితే లీకుల వీరుల సమాచారం ప్రకారం.. ఈ తొమ్మిదో వారం సన్నీ, మానస్, ఆర్జే కాజల్, జెస్సీ, శ్రీరామ్ మరియు విశ్వలు నామినేట్ అయినట్టు తెలుస్తోంది. మరి ఇదే నిజమైతే.. ఈ ఆరుగురిలో ఒకరు తొమ్మిదో వారం బ్యాగ్ సద్దేయనున్నారు.