ఎట్ట‌కేల‌కు ఫిక్సైన సుధీర్ పెళ్లి..డేట్ కూడా లాకైందిగా..?

బుల్లితెర స్టార్ క‌మెడియ‌న్‌, యాంక‌ర్‌, హీరో సుడిగాలి సుధీర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ షో ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన సుధీర్‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ అనేది బుల్లితెరపై బ్రాండ్ అయిపోయిందంటే.. ఆయ‌న రేంజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు.

Sudigali Sudheer (Comedian) Age, Caste, Wife, Girlfriend, Biography

కెరీర్ విష‌యం ప‌క్క‌న పెడితే.. బుల్లితెర‌పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ అయిన సుధీర్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఆయ‌న ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సుధీర్ పెళ్లిపై ఎన్నెన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ, ఏదీ నిజం కాలేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సారి నిజంగానే సుధీర్ పెళ్లి ఫిక్సైంద‌ట‌.

Coronavirus: సుడిగాలి సుధీర్ ఇంట్లో విషాదం | Sudigali Sudheer Grand Mother dies due to Coronavirus

ఇప్ప‌టికే సుధీర్ వ‌య‌సు 34 ఏళ్లు దాటిపోవ‌డంతో.. ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు పెళ్లి సంబంధాల వేటలో పడ్డార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే తాజాగా తమ ఫ్యామిలీకి చెందిన అత్యంత సన్నిహితుల ద్వారా ఓ సంబంధం కుదిరింద‌ని.. ఆ సంబంధం సుధీర్‌​కు బాగా నచ్చి ఓకే కూడా చెప్పాడ‌ని తెలుస్తోంది. ఇక అమ్మాయి సుధీర్ సొంత జిల్లాకు చెందిన యువతే అని తెలుస్తోంది. అంతేకాదు, వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి నెల‌లో పెళ్లి తేదీని సైతం లాక్ చేశార‌ని టాక్‌. మ‌రి దీనిపై సుధీర్ అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వాల్సి ఉంది.

Share post:

Latest