జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రజనీకాంత్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన తెలుగు లో పాట ఇతర సినిమాల్లో సైతం నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా అందుకున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పై కొన్ని కామెంట్ చేశాడు రజినీకాంత్. ఇప్పుడు వాడి గురించి చూద్దాం.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ సినిమాపొలిటికల్, ఫ్యామిలీ, లవ్, వంటి స్టొరీ తో సక్సెస్ అందుకున్నారు ఎన్టీఆర్ , త్రివిక్రమ్ అలాగే పూజా హెగ్డే. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు చాలా అద్భుతంగా తమ పాత్రలను పండించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విలన్ గా జగపతిబాబు బాగా ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ నటనకు తెలుగులోనే కాకుండా, ఇతర భాషల సైతం నటులు కూడా ప్రశంసలు కురిపించారు. అందులో ముఖ్యంగా రజినీకాంత్ కూడా ఒకరు. రజనీకాంత్ ఈ సినిమా చూసిన తరువాత మొదటిసారిగా మాట్లాడుతూ ..మొట్టమొదటి సారి నాకి కొడుకులు లేనందుకు బాధపడుతున్నాను అంటూ, ఎన్టీఆర్ లాంటి కొడుకు వుంటే చాలా బాగుండేది అంటూ తన మనసులో భావన కలిగింది అని చెప్పుకొచ్చాడు.

రజనీకాంత్ మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీ తో విడదీయరాని బంధం ఉన్నదట. ముఖ్యంగా హరికృష్ణతో స్నేహబంధం కూడా ఉన్నదని పలుమార్లు తెలియజేశాడు. హరికృష్ణ మరణించినప్పుడు తాను జపాన్ లో ఉండడం వల్ల రాలేకపోయానని తెలియజేశారట. తన తండ్రి మరణించినప్పుడు ఎన్టీఆర్ బాధను చూడలేక పోయానని రజనీకాంత్ చెప్పినట్లుగా సమాచారం.