సత్యదేవ్-నిత్యామీనన్‌ల‌ `స్కైల్యాబ్‌` ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, స‌హ‌జ న‌టి నిత్యామీనన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స్కైల్యాబ్‌`. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ బ్యాన‌ర్ల‌పై పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. రాహుల్ రామ‌కృష్ణ ఈ మూవీలో కీల‌క పాత్ర పోషించారు.

Skylab Stars and their roles revealed -

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 4న విడుద‌ల కానుంది. అయితే తాజాగా స్కైల్యాబ్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.`1979లో స్కైలాబ్‌ భూమిపై పడుతుందని, ప్రపంచం నాశనమై పోతుందని వార్తలొచ్చాయి. ఆ నేపథ్యంలో తెలుగు రాష్ట్రంలోని బండ లింగపల్లి గ్రామంలో ఉండే గౌరి(నిత్యామీన‌న్‌), ఆనంద్‌(స‌త్య‌దేవ్‌), రామారావు(రాముల్ రామ‌కృష్ణ‌)ల జీవితాల్లో స్కైల్యాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అన్నది ఈ చిత్ర క‌థ‌` అని ట్రైల‌ర్ బ‌ట్టీ స్ప‌ష్టంగా అర్థం అవుతోంది.

Skylab Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos | eTimes

అలాగే ఈ చిత్రంలో నిత్యామీన‌న్ జ‌ర్న‌లిస్ట్‌గా, స‌త్య‌దేవ్ డాక్ట‌ర్‌గా, అత‌డికి స్నేహితుడిగా రాహుల్ రామ‌కృష్ణ క‌నిపించ‌బోతున్నారు. మొత్తానికి సూప‌ర్ ఫ‌న్నీగా ఉన్న ఈ ట్రైల‌ర్ అదిరిపోవ‌డ‌మే కాదు..సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి లేటెందుకు మీరు స్కైల్యాబ్ ట్రైల‌ర్‌పై ఓ లుక్కేసేయండి.

Share post:

Popular