సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న శ్యామ్ సింగరాయ్ హ్యాష్ ట్యాగ్?

టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్ టీజర్ నవంబర్ 18 గురువారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. దీనితో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన సందడి అప్పుడే మొదలైంది. ఈ క్రమంలోనే శ్యామ్ సింగరాయ్ మూవీ మేకర్స్ టీజర్ రిలీజ్ చేయడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలిఉంది అంటూ తాజాగా ఈ సినిమా నుంచి మరొక పోస్టర్ ను విడుదల చేశారు. దీనితో నాని అభిమానులు సోషల్ మీడియాలో శ్యామ్ సింగరాయ్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో నాని డ్యూయల్ షేడ్‌లో కనిపించనుండడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో స్పెషల్ గా ‘శ్యామ్ సింగ రాయ్’ ట్రెండ్ అవ్వటం చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.మూవీ మేకర్స్ ఇటీవలే ఫస్ట్ సింగిల్ రైజ్ ఆఫ్ శ్యామ్ ని విడుదల చేసి సినిమా కోసం ప్రమోషన్ లను ప్రారంభించారు.

ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. .

Share post:

Latest