స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లుక్‌తో కనిపిస్తుండగా, అందాల భామ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తో పాటు లిరికల్ సాంగ్స్‌ను సైతం చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో ఈ సినిమాలోని మిగతా పాటలు ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్డేట్ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో ఓ మాస్ మసాలా సాంగ్‌లో స్టార్ హీరోయిన్ సమంత కనిపించబోతుందట.
స్టార్ హీరోయిన్గా ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమంత పుష్ప చిత్రంలో ఓ ఐటెం సాంగ్‌లో చిందులేసేందుకు రెడీ కావడంతో ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక సుకుమార్ తెరకెక్కించే చిత్రాల్లో స్టార్ హీరోయిన్లను ఐటెం పాపలుగా చూపించి సక్సెస్ అయిన దాఖలాలు గతంలో మనం చూశాం. రంగస్థలం చిత్రంలో పూజా హెగ్డేతో ఐటెం సాంగ్ చేయించి మరీ ఆ పాటను ఎలాంటి హిట్ చేశాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సమంత లాంటి స్టార్డమ్ ఉన్న బ్యూటీని కూడా ఐటెం గర్ల్‌గా మర్చేసి మరో సూపర్ హిట్ పాటను రెడీ చేస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. మరి సమంత చేయబోయే ఈ హాట్ ఐటెం సాంగ్ ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుంటుందో తెలియాలంటే ఈ పాట రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. కాగా ఈ సినిమాను డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.