ఒకే కథతో రవితేజ, బెల్లంకొండ సినిమాలు..ఇప్పుడిదే హాట్ టాపిక్‌..?!

టైగర్ నాగేశ్వరరావు.. 70వ దశకంలో మారిమోగిపోయిన పేరు ఇది. ఏపీలోనే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల్లోనూ త‌మ‌ దొంగతనాలు, దోపిడీలతో గడగడలాడించిన స్టువర్టుపురం దొంగల ముఠాకు నాయ‌కుడే టైగర్ నాగేశ్వరరావు. అయితే ఈయ‌న జీవిత కథ ఆధారంగా రెండు బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Ravi Teja's Tiger Nageswara Rao first poster out. See here - Movies News

మాస్ మ‌హారాజా ర‌వితేజ `టైగర్ నాగేశ్వరరావు` సినిమాను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. క్రైమ్ కామెడీ చిత్రాలకు ఫేమస్ అయిన వంశీ ఆకెళ్ళ ఈ మూవీని డైరెక్ట్ చేయ‌బోతుండ‌గా.. అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రీ లుక్ పోస్ట‌ర్ ద్వారా నిన్న‌నే ప్ర‌క‌టించారు.

Bellamkonda Sreenivas' next titled Stuartpuram Donga- Cinema express

అయితే కొన్నాళ్ల క్రితమే బెల్లంకొండ శ్రీనివాస్ ఇదే తరహా కథను ఎంచుకున్నాడు. `స్టువర్టుపురం దొంగ` టైటిల్ గా ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేసాడు. `బయోపిక్ ఆఫ్ ఏ టైగర్` అనేది ఈ సినిమా క్యాప్షన్. బెల్లంకొండ సురేష్ ఈ మూవీకి నిర్మాత‌. అయితే ఇలా ఒకే క‌థతో రెండు సినిమాలు రావ‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Share post:

Latest