రాశీ ఖన్నాకు బిగ్ ఆఫర్‌..8 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అటు వెళ్తుందా?!

రాశీ ఖ‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2013లో `మద్రాస్ కేఫ్‌` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. త‌ర్వాత మ‌నంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మలోకి అడుగు పెట్టి `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Rashi Khanna Biography, Age, Height, Family, Marriage, Movies - Breezemasti

ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో క్రేజీగా హీరోయిన్‌గా మారిపోయిన రాశీ ఖ‌న్నాను తాజాగా ఓ బిగ్ ఆఫ‌ర్ వ‌రించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో ఓ భారీ బ‌డ్జెట్‌ చిత్రం తెరకెక్కుతోంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపుదిద్దుకోనున్న‌ ఈ సినిమాకు `యోధ` అనే టైటిల్‌ను ప‌రిశీలిస్తున్నారు.

Karan Johar Announces First-ever Action Franchise; Sidharth Malhotra, Raashii Khanna to Star in Film?

పుష్కర్‌ ఓజా, సాగర్‌ ఆంబ్రే దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రంలో న‌టించే అద్భుత అవ‌కాశాన్ని రాశీ ఖ‌న్నాకు ద‌క్కింద‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్తి అయ్యాయ‌ని తెలుస్తుండ‌గా.. ఈ మూవీలో రాశీఖన్నా పాత్ర నెగెటివ్‌ షేడ్స్‌తో ప్రయోగాత్మక పంథాలో సాగుతుందని చిత్ర బృందం తెలిపింది.

Yoddha: Siddharth Malhotra, Disha Patani And Raashi Khanna To Share Screen Space In Karan Johar's Next

మొత్తానికి 8 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ బాలీవుడ్‌కు వెళ్తున్న ఈ బ్యూటీ.. ప్ర‌స్తుతం తెలుగులో నాగ చైత‌న్య స‌రస‌న `థ్యాంక్యూ`, గోపీచంద్ స‌ర‌స‌న `పక్కా కమర్షియల్‌` చిత్రాలు చేస్తోంది. అలాగే త‌మిళంలో కార్తీకి జోడీగా `సర్దార్‌`లో న‌టిస్తున్న రాశీ.. ప‌లు వెబ్ సిరీస్‌లూ చేస్తోంది.

Share post:

Latest