మ‌రోసారి చిరుకి చెల్లెలుగా మారుతున్న స్టార్ హీరోయిన్‌..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్‌ఫాద‌ర్` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళంలో హిట్టైన `లూసిఫర్`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతోంది.

GodFather Motion Poster Out! Here's a Glimpse Into Chiranjeevi's 153rd Film (Watch Video) | ? LatestLY

ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర ఎంతో కీల‌కంగా ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ రోల్‌ను మంజువారియర్ పోషించ‌గా.. తెలుగులో న‌య‌న‌తార న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

Ramya Krishna is absolutely a right choice to play main antagonist

కానీ, లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. చిరంజీవికి చెల్లెలుగా సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ న‌టించ‌బోతోంద‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు సైతం పూర్తి అయ్యాయ‌ని స‌మాచారం. కాగా, చిరు సరసన రమ్యకృష్ణ పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ.. ఆమె కెరీర్ బిగినింగ్ లో `చక్రవర్తి` సినిమాలో ఆయనకి చెల్లెలిగా నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు మ‌రోసారి మెగాస్టార్‌కి ర‌మ్య‌కృష్ణ చెల్లెలుగా మార‌బోతోంది.