లైగర్ సినిమా సెట్ నుంచి మైక్ టైసన్ ఫోటో వైరల్..!!

November 16, 2021 at 1:07 pm

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఛార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా లైగర్. హీరోగా విజయ్ దేవరకొండ తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ప్రముఖ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా కోసం ఏకంగా 14 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇకపోతే ఈ సినిమాలో రియల్ బాక్సర్ మైక్ టైసన్ విలన్ గా నటిస్తుండడం తో ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా సెట్లో బాలయ్య మెరిసి సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేశారు. ఇకపోతే పాన్ ఇండియా మూవీగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్ అమెరికాలోని లాస్ వెగాస్‌లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌తో తీవ్రమైన యాక్షన్ షెడ్యూల్ కోసం టీం మొత్తం అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ నవ్వులు పువ్వులు పూయిస్తున్న మైక్ టైసన్ ని చూస్తూ విజయ్ దేవరకొండ కూడా నవ్వుతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ పిక్ ని చూసిన అభిమానులు అంతా సినిమాపై మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు.

లైగర్ సినిమా సెట్ నుంచి మైక్ టైసన్ ఫోటో వైరల్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts