రాజమౌళి.. డైరెక్టర్ కాకపోతే.. ఆ పని చేసేవాడట..!

టాలీవుడ్ లో దిగ్గజ ధీరుడు రాజమౌళి అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక తాజాగా ఈయన RRR సినిమాను 300 కోట్ల రూపాయల సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా వచ్చే సంవత్సర జనవరి నెలలో విడుదల కానుంది. ఈ సినిమా మల్టీస్టారర్ గా ఉన్నది. ఈ మూవీలో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే రాజమౌళి వైద్య కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. సక్సెస్ కావాలంటే తగిన ప్రయాణం అవసరమని నేను నమ్ముతున్నాను అని తెలియజేశాడు. ఏ సినిమా కథ అయినా నన్ను బాగా ప్రేరేపించాలి అప్పుడే దాన్ని ఒక అద్భుతంగా తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చాడు.

ఒకవేళ నేను దర్శకుడిని కాకపోయి ఉంటే.. నాకు డ్రైవింగ్ వచ్చు. కాబట్టి డ్రైవర్ అయ్యేవాడిని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయాలు విన్న అక్కడ స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇక ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు.