దర్శకధీరుడు రాజమౌళి నటించిన అట్టర్ ఫ్లాప్ సినిమా ఏంటో తెలుసా?

November 21, 2021 at 7:06 pm

ఎస్ ఎస్ రాజమౌళి. తెలుగు సినిమా పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు. తను తెరకెక్కించిన సినిమాలన్నీ ఇండస్ట్రీని షేక్ చేసినవే. తెలుగు సినిమా స్థాయిని ఖండాంతరాలు దాటించిన ఘనత ఆయనకు దక్కుతుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేసిన ఆయన.. బ్లాక్ బస్టర్ సినిమాలను తీశాడు. స్టూడెంట్ నెంబర్ వన్ మొదలు కొని బాహుబలి సినిమా వరకు అన్ని సినిమాలు ఓ రేంజిలో విజయం సాధించినవే. ఆయన ప్రస్తుంతం హాలీవుడ్ స్థాయి దర్శకుడిగా ఎదిగాడు. అయితే దర్శకుడిగా పరాజయం అంటూ ఎరుగని రాజమౌళి.. తను నటించిన సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఆయన నటించిన సినిమా ఫ్లాప్ కావడం ఏంటని అనుకుంటున్నారు. ముమ్మాటికీ వాస్తవం తను నటించిన ఓ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

దర్శకధీరుడికి ఫ్లాప్ అంటే ఏంటో చూపించిన సినిమా రెయిన్ బో. ఆయన దర్శకుడిగానే చాలా మందికి తెలుసు. కానీ ఆయనలో ఓ నటుడు కూడా ఉన్నాడు. ఆనటనే తనకు పరాజయం అంటే ఏంటో తెలిసి వచ్చేలా చేసింది. ప్రముఖ దర్శకుడు వీఎస్ ఆదిత్య ఓ సినిమా చేశాడు. దానికి రెయిన్ బో అని పేరు పెట్టాడు. ఇందులో రాజమౌళికి ఓ క్యారెక్టర్ ఇచ్చాడు. దీంతో ఆయన సినిమాపై ఓ రేంజిలో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ సినిమా విడుదల అయ్యాక ఆ అంచనాలు తలకిందులు అయ్యాయి. దీంతో ఆయన కెరీర్ లో మొదటి ఫ్లాప్ మూవీగా నిలిచిపోయింది.

అటు ఈ సినిమా తీసిన దర్శకుడు ఆదిత్య కూడా చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. వాస్తవానికి రాజమౌళికి ఈ సినిమాలో చేయడం అస్సలు ఇష్టం లేదట. కానీ దర్శకుడు అడిగే సరికి నో చెప్పలేకపోయాడట. కానీ ఈ సినిమా ఫ్లాప్ కావడంతో రాజమౌళికి కూడా బాధేసిందట. అటు రాజమౌళి ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. జనవరి 7న జనాల ముందుకు ఈ సినిమాను తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాపై ప్రస్తుతం జనాల్లో ఏ రేంజిలో అంచనాలు నెలకొన్నాయి.

దర్శకధీరుడు రాజమౌళి నటించిన అట్టర్ ఫ్లాప్ సినిమా ఏంటో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts