ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. చదివితే కన్నీళ్లు ఆగవు..!

November 21, 2021 at 7:10 pm

చిత్రం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయిన క్యూట్ యాక్టర్ ఉదయ్ కిరణ్. ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో.. అతి కొద్ది సమయంలోనే పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి చక్కటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తన సినీ ప్రయాణంలో ఎన్నో అవమానాలకు గురయ్యాడు. అతడికి అవకాశాలు రాకుండా చేశారు కొంత మంది సినీ పెద్దలు. దీంతో తను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు.

సినిమాలో అవకాశాలు తగ్గడంతో విషిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఉదయ్ కిరణ్. వీరి సంసార జీవితం కొంత కాలం బాగానే కొనసాగింది. అయితే ఉదయ్ కిరణ్ కు ఆ తర్వాత కూడా అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఆయనను చుట్టుముట్టాయి. అటు సంసార జీవితంలో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే తను ఎంతో ఒత్తిడికిలోనై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చనిపోయే ముందు ఓ లేఖ రాశాడు. ఆ లెటర్ చదివి చాలా మంది ఎంతో బాధపడ్డారు. ఇంతకీ ఆలేఖలో ఏముందంటే..

విషితా.. మా అమ్మ అంటే ఎంత ఇష్టమో..ఆ తర్వాత అంతటి స్థాయిలో నేను ప్రేమించిన అమ్మాయివి నువ్వు. అయితే మన మధ్య గొడవల కారణంగా అంకులు, ఆంటీ చాలా బాధపడుతున్నారు. వారికి ఈ బాధ ఉండకూడదు. నువ్వు అతడు మంచి వాడు అని నమ్ముతున్నావు. కానీ అతడు మంచివాడు అస్సలు కాదు. నా మాట విను. నువ్వు నిజం తెలుగునే రోజు నీ పక్కన ఉదయ్ ఉండడు. నువ్వు ఒకసారి అమెరికాకు వెళ్లి వైద్యం చేయించుకో. నాకు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. నన్ను ఓ మ్యాడ్ గా చిత్రీకరించి ఆడుకుంది. మన మధ్య గొడవల కారణంగా చాలా మంది బాధపడుతున్నారు. అందరూ సంతోషంగా ఉండాలంటే నేను ఉండకూడదు అనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మ నీకు ఇచ్చిన నగలను తిరిగి మా అక్కకు ఇవ్వు. వాటిని తను జాగ్రత్తగా దాచుకుంటుంది. అమ్మా నిన్ను ఓసారి కౌగిలించుకుని ఏడ్వాలని ఉంది. అందుకే నీ దగ్గరికి వస్తున్నా.. అంటూ తన చివరి లేఖను రాశాడు.

ఉదయ్ కిరణ్ చివరి లేఖ.. చదివితే కన్నీళ్లు ఆగవు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts