బాలీవుడ్‌కి `పుష్పక విమానం`.. హీరో ఎవ‌రో తెలుసా?

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు, టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ మూడో చిత్ర‌మే `పుష్ప‌క విమానం`. దామోదర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో గీత్ సైనీ, సాన్వి మేఘన హీరోయిన్లుగా న‌టించ‌గా.. సునీల్‌, న‌రేష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ న‌వంబ‌ర్ 12న విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది.

Pushpaka Vimanam Movie Review: A half baked medley that fails to thrill or elicit laughs | PINKVILLA

పెళ్లయిన కొన్ని రోజులకే భార్య లేచిపోతే భర్త పడే కష్టాలు అనే పాయింట్ మీద తెర‌కెక్కిన ఈ చిత్రం మొదటి సగం సరదాగా, రెండో సగం ఉత్కంఠగా, ప్రీ క్లైమాక్స్ బాధగా, క్లైమాక్స్ సందేశాత్మకంగా ఉండ‌టంతో.. యూత్ మ‌రియు ఫ్యామిలీ ఆడియ‌న్స్ బాగా క‌నెక్ట్ అయ్యారు. దీంతో ఈ చిత్రం రీమేక్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడిందని తాజాగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు.

Pushpaka Vimanam Movie Review: This comedy-thriller is a mixed bag

బాలీవుడ్ నుంచి మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయని..ఆ సంస్థల వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తామ‌ని అనురాగ్ తెలిపారు. ఇక వినిపిస్తున్న లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా హీందీ రీమేక్‌లో రాజకుమార్ రావు, విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా వీరి ముగ్గురులో ఎవరో ఒకరు న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది.

Share post:

Popular