పుష్ప నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ డేట్ వచ్చేసింది..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగానికి పుష్ప ది రైజ్ అని పేరు పెట్టారు. పుష్ప నుంచి విడుదలైన టీజర్ యూట్యూబ్ లో ఇప్పటికే రికార్డు బద్దలు కొట్టింది. పుష్ప సింగిల్ సాంగ్స్ దాక్కో దాక్కో మేక, సామీ నా సామీ, శ్రీవల్లీ పాటలు యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతోంది. అందులో భాగంగా డిసెంబర్ 6న ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఇవాళ ఉదయం ఈ మూవీ మేకర్స్ అఫీషియల్ గా ఒక పోస్టర్ విడుదల చేశారు. పుష్ప టీజర్ ఇప్పటికే గూస్ బంప్స్ వచ్చేలా కట్ చేసిన సుకుమార్ ప్రజలను కూడా అదే రేంజ్ లో కట్ చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మహేష్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ ఇంతకుముందెప్పుడూ కనిపించని విధంగా మార్పు గెటప్ లో కన్పిస్తున్నాడు.

మలయాళ నటుడు ఫాహద్ పాజిల్, సునీల్ విలన్లుగా నటిస్తున్నారు. రంగస్థలం సినిమాలో కీలకపాత్ర పోషించిన అనసూయ పుష్పలో కూడా మరోసారి కీలక పాత్రలో మెరవనుంది. పుష్ప నుంచి ఇప్పటికి నాలుగు సింగల్ సాంగ్స్ విడుదల కాగా త్వరలో 5వ పాట కూడా విడుదల కానుంది. కాగా పుష్ప సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సుమారు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో భారీగా తెరకెక్కిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా భారీగా రిలీజ్ కానుంది.

 

Share post:

Latest