ప‌వ‌న్‌తో ఆ ఎక్స్‌పీరియన్స్ సూప‌రంటున్న ప్ర‌ముఖ హీరోయిన్‌..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప్ర‌ముఖ హీరోయిన్ నిత్యా మీన‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యాలు చేసింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌, రానా ద‌గ్గుబాటితో క‌లిసి `భీమ్లా నాయ‌క్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

Ayyappanum Koshiyum Remake: Nithya menen Next movie with Pawan Kalyan  Flixadda

అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యా మీనన్‌, రానా స‌ర‌స‌న సంయుక్త మీన‌న్‌లు న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిత్యా మీన‌న్‌.. ప‌వ‌న్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తో ఫ‌స్ట్ టైమ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాను. ఆయ‌నతో క‌లిసి న‌టించ‌డం ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకొచ్చింది.

Nithya Menen Net Worth 2021: Income, Salary, Assets, Bio

అలాగే పవన్ తో పని చేయడం చాలా ఈజీ అండ్ సూప‌ర్ అంటూ నిత్యా మీన‌న్ పేర్కొంది. ఇక పవన్ చాలా సైలెంట్ గా ఉంటాడని.. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు. దాంతో నిత్యా వ్యాఖ్యాలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest