పెళ్లిపై మ‌న‌సు ప‌డ్డ నిధి..అలాంటి అబ్బాయే కావాల‌ట‌..!

November 30, 2021 at 1:06 pm

ప్ర‌ముఖ హీరోయిన్‌ నిధి అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ అందాల భామ.. చందూ మొండేటి దర్శకత్వం లో నాగ‌చైత‌న్య హీరోగా వ‌చ్చిన `సవ్యసాచి` చిత్రం తో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ ర్వాత మిస్ట‌ర్ మ‌జ్ను మూవీలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన నిధి.. `ఇస్మార్ట్ శంక‌ర్‌` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది.

ఈ చిత్రం ద్వారా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న నిధి.. ఆ త‌ర్వాత‌ మ‌రిన్ని అవ‌కాశాల‌ను సైతం ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స‌ర‌స‌న డైరెక్ట‌ర్ క్రిష్ తెర‌కెక్కిస్తున్న `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` చిత్రంలో న‌టిస్తోంది. అశోక్ గల్లా హీరోగా తెరకెక్కుతున్న `హీరో`మూవీలోనూ హీరోయిన్ గా నటించిన నిధి.. ఇత‌ర భాష‌ల్లోనూ ప‌లు ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్ చేసింది.

అయితే తాజాగా ఏమైందో ఏమో కానీ.. నిధి మ‌న‌సు పెళ్లిపై మ‌ల్లింది. పింక్‌ కలర్‌ చీరలో దిగిన కొన్ని ఫోటోలను ట్విట్టర్ ద్వారా పోస్ట్ నిధి.. `ఒక అందమైన, మంచి అబ్బాయి కావాలి.. అత‌డి కోసమే ఎదురు చూస్తున్నాను` అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జోడించిందీ. దీంతో ఆమె పోస్ట్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇక నిధి అగ‌ర్వాల్ ఫొటోల విష‌యానికి వ‌స్తే.. చీర‌లో ఆమె వ‌య్యారాల‌ను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. అంత అందంగా నిధి మెరిసిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఆమె పిక్స్‌పై అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

పెళ్లిపై మ‌న‌సు ప‌డ్డ నిధి..అలాంటి అబ్బాయే కావాల‌ట‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts