స్నేహితుడి కోసం నాని సెర్చింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

November 23, 2021 at 9:57 am

స్నేహితుడి కోసం నాని సెర్చింగ్ చేయ‌డం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. న్యాచుర‌ల్ నాని ఇటీవ‌ల త‌న 29వ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రానికి `ద‌స‌రా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది.

Siren Of Dasara | Nani, Keerthy Suresh | Srikanth Odela | Sudhakar Cherukuri - YouTube

సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రంలో నాని తెలంగాణ యాసలో అద‌ర‌గొట్ట‌బోతున్నాడు. అలాగే ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించ‌బోతుండ‌గా.. సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాని స్నేహితుడి పాత్ర ఒక‌టి ఉంటుంద‌ట‌.

It's official! Nani and Keerthy Suresh to reunite after Nenu Local for Dasara

ఆ పాత్ర సినిమాకే కీల‌కంగా ఉంటుంద‌ని, సినిమాలోని చాలా స‌న్నివేశాలు నాని మ‌రియు అత‌డి స్నేహితుడి పాత్ర‌తోనే ముడిప‌డి ఉంటాయ‌ని అంటున్నారు. అందుకే ఈ రోల్ కోసం ఎవ‌ర్ని తీసుకోవాలా..? అని ఫుల్‌గా సెర్చింగ్ చేస్తున్నార‌ట‌. మ‌రి నానికి స్నేహితుడు ఎప్పుడు దొర‌కుతాడో చూడాలి.

Nani plays Vasu in Shyam Singha Roy, film to release in December. See poster - Movies News

కాగా, రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని న‌టించిన తాజా చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ డిసెంబ‌ర్ 24న విడుద‌ల కానుంది. ఇక ప్ర‌స్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది పూర్తైన వెంట‌నే ద‌స‌రా సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

స్నేహితుడి కోసం నాని సెర్చింగ్‌..అస‌లు మ్యాట‌రేంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts