నాటు.. మరీ ఇంత నాటు అయితే ఎలా జక్కన్న?

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ సినీ ప్రేమికులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్‌పై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ వచ్చినా ప్రేక్షకులకు ఆరోజు పండగనే చెప్పాలి.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్లు, దోస్తీ అనే పాటను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. ‘నాటు నాటు’ అంటూ సాగే ఈ మాస్ సాంగ్ మామూలు నాటుగా లేదని చెప్పాలి. కీరవాణి అత్యద్భుత సంగీతానికి తారక్, చరణ్‌ల మైండ్ బ్లోయింగ్ స్టెప్స్ తోడవ్వడంతో ఈ పాట సరికొత్త చరిత్ర సృష్టించేలా దూసుకుపోతుంది. రిలీజ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఈ పాట ప్రేక్షకులకు పిచ్చిపిచ్చిగా ఎక్కేసిందని చెప్పాలి. ఇద్దరు హీరోలు కూడా పోటీ పడుతూ చేసిన డ్యాన్స్ ఈ లిరికల్ సాంగ్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లగా, ఇక సినిమాలో ఈ పాట ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీలో పలువురు లెజెండీ యాక్టర్స్ కూడా నటిస్తుండటం విశేషం. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, బాలీవుడ్ భామ ఆలియా భట్‌లతో పాటు పలువురు బ్రటిష్ నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమాను జనవరి 7న రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతోంది. మరి ఈ వీరనాటు పాటను మీరూ ఓసారి చూసేయండి.

Share post:

Latest