తుఫాను రేపుతున్న కృతి శెట్టి ముద్దు!

టాలీవుడ్‌లో కొత్తగా వచ్చే హీరోయిన్లు ఇప్పుడు అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు లిప్ లాక్ అనేది కామన్‌గా మారిపోయింది. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం రాగానే ఘాటైన ముద్దు సీన్స్‌తో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. ఇలాంటి వారిలో తాజాగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా చేరిపోయింది. ఉప్పెన చిత్రంలో చాలా పద్దతిగా నటించిన ఈ భామ, ఇప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’ చిత్రంలో యంగ్ హీరో అక్కినేని నాగార్జున సరసన హీరోయిన్‌గా కృతి శెట్టి నటిస్తోంది.

ఇక మరో యంగ్ హీరో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమాలో కూడా ఈ బ్యూటీ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో నాని రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో సెకండ్ హీరోయిన్‌గా కృతి శెట్టి కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆద్యాంతం నాని పాత్రను ఎలివేట్ చేసే విధంగా ఉండటంతో ఈ టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

అయితే ఈ టీజర్ చివర్లో కృతి శెట్టి నానికి ఘాటైన లిప్‌లాక్ ఇస్తుంది. ఇది అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా టాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. నాని లాంటి క్రేజ్ ఉన్న హీరోకు టీజర్‌లోనే ఇంత ఘాటైన లిప్‌లాక్‌ను ఇచ్చిందంటే, ఇక సినిమాలో ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ అయ్యింది ఒకే సినిమా అయినా, అప్పుడే ఈ బ్యూటీ హద్దులు చెరిపేసిందని, ఇకపై బోల్డ్ పాత్రలు చేసేందుకు కూడా రెడీ అంటూ ఫిల్మ్ మేకర్స్‌కు అమ్మడు ఈ సినిమా ద్వారా హింట్ ఇచ్చిందని చెప్పాలి.

మరి ఈ సినిమాలో కృతి శెట్టి పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందా, అమ్మడి లిప్‌లాక్ ఆమెకు ఎలాంటి అవకాశాలను తెచ్చిపెడుతుందా, ఈ సినిమాలో కేవలం లిప్‌లాక్‌కే పరిమితం అయ్యిందా లేక అందాల ఆరబోతను కూడా వడ్డించనుందా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Share post:

Latest