కొరియ‌న్ భామ ప్రేమ‌లో ప్ర‌భాస్‌..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌?!

కొరియ‌న్ భామ ప్రేమ‌లో ప‌డ‌నున్నాడు ప్ర‌భాస్‌. అయితే ఇది రియ‌ల్ కాదండోయ్ రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని `అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు.

Bahubali Fame Prabhas announced his 25th Film 'SPIRIT': take a look at the first poster

టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించ‌బోతున్న ఈ చిత్రం భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఓ కొరియన్ బ్యూటీని ఎంపిక చేయబోతున్నారట. ఇంత‌కీ ఆ కొరియ‌న్ భామ ఎవ‌రో కాదు..కొరియన్ టీవీ డ్రామాలతో ఫేమస్ అయిన సాంగ్ హై క్యో.

Song Hye Kyo Transforms Into A Stylish Career Woman In Upcoming Romance Drama | Soompi

ఆమెతోనే ఈ చిత్రంలో ప్ర‌భాస్ ప్ర‌మాయ‌ణం న‌డ‌ప‌నున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, ఈ విష‌యంపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని టాక్‌. కాగా, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, చైనీస్‌, కొరియన్‌, జపాన్‌ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.