కేవలం వాళ్ల కోసమే ఆర్ ఆర్ ఆర్ ప్రీమియర్ షో వేశారట..కారణం..!!

జక్కన్న సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఆయన ఏ సినిమా మొదలు పెట్టినా..అది సంవత్సరాల తరబడి సమయం తీసుకున్నప్పటికీ, ఖచ్చితంగా సక్సెస్ ను సాధిస్తాడు అని అందరికీ తెలిసిన విషయమే. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా.. గత కొన్ని నెలల నుంచి వాయిదా పడుతూనే వస్తోంది.. కానీ ఎట్టకేలకు ఈ పాన్ ఇండియా మూవీ ని జనవరి 7 2022 వ తారీఖున విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు.

అయితే ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షోని వేశారు అనే వార్తలు వస్తున్నాయి. తాజాగా రాంచరణ్ , ఎన్టీఆర్ ఫ్యామిలీ లకు ఈ సినిమా యొక్క ప్రీమియర్ షో ని చూపించారని సమాచారం.. చూసిన వారు ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఇక మెగాస్టార్ చిరంజీవి.. రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నాడు అంటే తప్పకుండా ఈ సారి రాజమౌళి మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి నట్టే..

Share post:

Latest