సంక్రాంతి బ‌రిలో `అఖండ‌`.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..!?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు.

Akhanda Release Date: Did 'Akhanda' already make 57 crore even before announcement of release date?

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై సార్వ‌త్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా డిసెంబ‌ర్ 2న విడుద‌ల కానుంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా.. ఇప్పుడు మ‌రో తేదీ తెర‌పైకి వ‌చ్చింది.

Akhanda: NBK's BB3 musical roar begins tomorrow - English

ఇంత‌కీ ఈ కొత్త తేదీ ఏదో కాదు.. జనవరి 12 అట. సంక్రాంతి కానుక‌గా జనవరి 12న అఖండ‌ను విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే సంక్రాంతి రేసులోకి దిగుదామ‌నుకున్న హీరోలంద‌రూ త‌మ సినిమాల‌ను వాయిదా వేసుకుంటున్నారు. కానీ, బాల‌య్య ఏరి కోరి సంక్రాంతి బ‌రిలోకి దూకేందుకు సిద్ధ‌మ‌వ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.