ఆగిపోయిన క‌ళ్యాణ్ రామ్ `బింబిసార`..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌..?

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న చిత్ర‌మే `బింబిసార‌`. ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిత‌మ‌వుతున్న‌ ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా.. సంయుక్త మీనన్, కేథరిన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Pic Talk: Kalyan Ram looks menacing as Bimbisara - TeluguBulletin.com

అయితే మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్ మ‌రియు హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆగిపోయింద‌ట‌. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు కానీ, సోష‌ల్ మీడియాలో ఈ వార్త తెగ వైర‌ల్ అవుతోంది. తాత ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ రిలీజ్ చేసారు.

Bimbisara Movie - Trailer, Star Cast, Release Date | Paytm.com

కానీ, ఆ త‌ర్వాత ఒక్క‌టంటే ఒక్క అప్డేట్ కూడా ఈ చిత్రం నుంచి రాలేదు. రోజులు, నెల‌లు గ‌డుస్తున్నా ఇంతవరకూ ప్రాజెక్టు నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఈ నేప‌థ్యంలోనే బింబిసార ఆగిపోయిందని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. దీంతో ఆయ‌న ఫ్యాన్స్‌ ఆందోళ‌న చెందుతూ.. ఇప్ప‌టికైనా ఏదో ఒక అప్డేట్ ఇవ్వాల‌ని చిత్ర‌యూనిట్‌ను కోరుతున్నారు.

Share post:

Latest