పైసా సంపాదన లేదు..ఆమే న‌న్ను పోషించింది: రాజ‌మౌళి

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అంటే తెలియ‌ని వారుండ‌రు. ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఈయ‌న ఒక‌రు. అప‌జ‌య‌మే ఎరుగ‌ని ద‌ర్శ‌క‌ధీరుడు. అటువంటి గొప్ప వ్య‌క్తి కూడా కెరీర్‌లో ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. ఒకానొక స‌మ‌యంలో పైసా సంపాద‌న లేక భార్య మీద ఆధార‌ప‌డి జీవించారు. అవును, ఈ విష‌యాలు ఎవ‌రో కాదు.. ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు.

SS Rajamouli and wife Rama enjoy wildlife safari at Bandipur Tiger Reserve forest. See pics - Movies News

ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్‌లో రాజ‌మౌళి మాట్లాడుతూ..తనకు చదువు అంతగా రాలేదని.. తన చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని తెలిపాడు. అలాగే ద‌ర్శ‌కుడిగా ఎదిగే క్ర‌మంలో ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాన‌ని.. ఒకానొక స‌మ‌యంలో పైసా సంపాద‌న లేక అనేక ఇబ్బందుల‌ను ఫేస్ చేశాన‌ని చెప్పుకొచ్చారు.

SS Rajamouli And Rama Rajamouli Love Story

ఇక ఆ స‌మ‌యంలో భార్య ర‌మా జీతం మీద బతికానని ఆమెనే తనని పోషించిందని ఆయన పేర్కొన్నాడు. అలా చెప్పుకోవడానికి తనకు సిగ్గేయడం లేదని సంతోషంగా ఉందని తెలిపారు. దాంతో జ‌క్క‌న్న వ్యాఖ్యాలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో `ఆర్ఆర్ఆర్‌` చిత్రం తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కాబోతోంది.