జూనియర్ ఎన్టీఆర్ వివాహం ఖర్చు ఎంతో తెలుసా..?

November 16, 2021 at 4:15 pm

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఎన్టీఆర్ మాత్రం తన పర్సనల్ విషయాలను బయట చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ అభిమానులు మాత్రం అలాంటి విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆతృతతో ఉంటారు. అయితే ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం 2011 లో జరిగింది. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషయాలు అందరికీ తెలుసు. అయితే ఎన్టీఆర్ పెళ్లి ఎలా జరిగింది.. వాటికయ్యే ఖర్చు ఎంతో ఇప్పుడు చూద్దాం.

2011 లో మే 5వ తేదీన ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి ల వివాహం హైదరాబాద్ లో జరిగింది.వీరి వివాహానికి తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రముఖులంతా హాజరయ్యారు. దీంతో ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహానికి చాలా మంది రాజకీయ నాయకులు కూడా హాజరవడం జరిగింది. ఇక ఎన్టీఆర్ పెళ్లి కి దాదాపుగా 18 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక పెళ్లికి కట్నం కూడా ఎన్టీఆర్ బాగానే తీసుకున్నాడు అన్నట్లుగా వార్తలు వినిపించాయి.

జూనియర్ ఎన్టీఆర్ వివాహం ఖర్చు ఎంతో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts