బిగ్‌బాస్ 5: ప‌దో వారం నామినేటైన కంటెస్టెంట్స్‌ ఎవ‌రెవ‌రో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొమ్మిదో వారం పూర్తై..ప‌దో వారం ప్రారంభం అయింది. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేత వ‌ర్మ‌, ప్రియ‌, లోబో మ‌రియు విశ్వ‌లు ఎలిమినేట్ కాగా.. హైస్‌లో ఇంకా ప‌ది మందే మిగిలి ఉన్నారు.

ఇక నేడు సోమ‌వారం. అంటే నామినేష‌న్ల ప్ర‌క్రియ‌తో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే రోజు. మ‌రోవైపు ప్రేక్ష‌కులు సైతం ఎవ‌రెవ‌రు నామినేట్ అవుతారా అని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తుంటారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప‌దో వారం ఐదురుగు నామినేట్ అయిన‌ట్టు తెలుస్తోంది.

Nagarjuna's Bigg Boss Telugu Season 5 to premiere on September 5. Watch new promo - Television News

ఈ లిస్ట్‌లో సన్నీ, మానస్, కాజల్, యాంక‌ర్‌ రవి, సిరిలు ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మైతే.. ప‌దో వారం ఈ ఐదుగురిలో ఎవ‌రు బ్యాగ్ స‌ద్దేస్తారు అన్న‌ది చూడాల్సి ఉంది.

Share post:

Latest