`ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా`..పుష్ప మాస్ సాంగ్ వ‌చ్చేసింది!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.

Pushpa: Saami Saami Song Ft. Allu Arjun & Rashmika Mandanna Fails To Live Up To The Hype

అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైజ్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. వ‌రుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు.

allu arjun: Eyy Bidda, Idhi Naa Adda: New single from Allu Arjun and Rashmika Mandanna's Pushpa to be out soon | Telugu Movie News - Times of India

ఇందులో భాగంగానే పుష్ప నాలుగో సాంగ్‌ను తాజాగా విడుద‌ల చేశారు. `ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా..` అంటూ సాగే ఈ మాస్ సాంగ్‌లో బ‌న్నీ తనదైన స్టెప్పులతో అద‌ర‌గొట్టేశాడు. ఈ సాంగ్‌కి చంద్రబోస్ రాసిన లిరిక్స్ అద్బుతం గా ఉండ‌గా..నకాష్ అజీజ్ ఆల‌పించిన తీరు ఆక‌ట్టుకుంటోంది.

Pushpa The Rise – Part 1 Song Eyy Bidda Idhi Naa Adda: Allu Arjun's Swag And Moves Makes This Track A Mass Number! (Watch Lyrical Video) News & More in Hindi

ఇక దేవిశ్రీ అందించిన ట్యూన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మొత్తానికి అదిరిపోయిన ఈ మాస్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారుతోంది. కాగా, ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బ‌న్నీ పుష్ప‌రాజ్‌గా, ర‌ష్మిక శ్రీ‌వ‌ల్లిగా క‌నిపించ‌నున్నారు. అలాగే సునీల్‌, ఫహాద్‌ ఫాజిల్, అన‌సూయ త‌దిత‌ర‌లు కీల‌క పాత్ర‌లు పోసిస్తున్నారు.

 

Share post:

Latest