`దృశ్యం 2` ఫ‌స్ట్ షో టాక్ అదుర్స్‌..వెంకీ ఖాతాలో మ‌రో విక్ట‌రీ!

సీనియ‌ర్ స్టార్ హీరో వెంక‌టేష్‌, మీన ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `దృశ్యం 2`. 2014లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న `దృశ్యం 2`కు జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైన‌ప్ప‌టికీ.. క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆల‌స్యం అవుతూ వ‌చ్చింది.

Drushyam 2 Telugu Movie Review - Only For First Timers!

అయితే ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేడు విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే ఫ‌స్ట్ షో టాక్ కూడా బ‌య‌ట‌కు రాగా.. దృశ్యం 2పై పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా అదుర్స్.. వెంకీ ఖాతాలో మ‌రో విక్ట‌రీ ప‌డ‌టం ఖాయం అంటూ నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా ద్వారా త‌మ అభిప్రాయాల‌ను పంచుకుంటున్నారు.

Drushyam 2 : వెంకటేష్ 'దృశ్యం 2' రివ్యూ | Venkatesh Drushyam 2 Telugu Movie  Review

ఇక దృశ్యం సినిమా ముగింపు నుంచి దృశ్యం 2 ప్రారంభమవుతుంది. వరుణ్‌(న‌దియా కొడుకు) కేసు నుంచి ఈసారి రాంబాబు(వెంక‌టేష్‌) తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడన్న ప్రశ్న ప్రేక్షకుడిని వెంటాడుతూ ఉంటుంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రాంబాబు వేసే ఎత్తులు, పైఎత్తులతో సినిమా ఎంతో ఉత్కంఠభ‌రితంగా సాగుతుంది. ముఖ్యంగా చివ‌రి గంట‌లో ద‌ర్శ‌కుడు పెట్టిన మ‌లుపులు మ‌రింత అల‌రిస్తాయి.

Venkatesh's 'Drushyam 2' to directly release on OTT? | Telugu Movie News -  Times of India

అలాగే వెంక‌టేష్ కళ్లతో అద్భుతంగా ఎమోషన్స్‌ని పలికిస్తూనే.. తన నటనతో ప్రేక్షకులను ఆక‌ట్టుకున్నాడు. రాంబాబు భార్య పాత్రలో మీనా, కుమార్తెలుగా కృతిక, ఏస్తర్‌లు తమ పరిధి మేరకు నటించారు. ఐజీగా సంపత్‌రాజ్‌, కానిస్టేబుల్‌గా సత్యం రాజేశ్‌, రచయితగా తనికెళ్ల భరణి, లాయర్‌గా పూర్ణ కీలక పాత్రలు పోషించి మెప్పించారు. ఓవరాల్ గా చూసుకున్నట్టైతే దృశ్యం 2 సినిమా ఖచ్చితంగా అంద‌రి అంచనాలను అందుకుంటుంది.

Share post:

Latest