త‌మ‌న్నా ఆ వ్య‌క్తి చేతిలో దారుణంగా మోస‌పోయింద‌ని మీకు తెలుసా?

November 23, 2021 at 8:00 am

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మంచు మనోజ్ కుమార్ హీరోగా తెర‌కెక్కిన `శ్రీ‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ల చెంత చేరింది. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ప‌దిహేనేళ్లు దాటిపోయినా ఇంకా వ‌రుస సినిమాల‌తో స‌త్తా చాటుతున్న ఈ భామ‌.. ఓ వ్య‌క్తి చేతిలో దారుణంగా మోస‌పోయింది.

Tamanna Latest Photos, Pictures & HD Images - Kerala9.com

ఇంత‌కీ ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు.. ఆమె ప‌ర్స‌న‌ల్ మేనేజర్. స్టార్ హీరోయిన్ గా ఎంతో బిజీగా గడుపుతున్న సమయంలో తమన్నా తన ఫైనాన్షియల్ విషయాలన్నీ పూర్తిగా మేనేజర్ ని నమ్మి అతని చేతిలో పెట్టింది. కానీ, సదరు మేనేజర్ మాత్రం ప్రభుత్వానికి కట్టాల్సిన టాక్స్ లను కట్టకుండా చేతివాటం చూపించారు.

Tamannah Bhatia Age Wiki, Family, Husband, Net Worth, Movies

అయితే కొద్ది రోజుల‌కు ప్రభుత్వం నుంచి నోటీసులు రావడంతో షాకైన త‌మ‌న్నా.. ఎంత‌గానో న‌మ్మిన మేనేజ‌రే మోసం చేశాడ‌ని తెలుసుకుంది. దాంతో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను చెల్లించిన మిల్కీ బ్యూటీ.. అప్ప‌టి నుంచీ ఫైనాన్షియల్ విషయాలలో ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Tamannaah Bhatia to take legal action against MasterChef Telugu, know what's the matter? | NewsTrack English 1

కాగా, త‌మ‌న్నా సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `భోళా శంక‌ర్‌` చిత్రంలో చిరంజీవితో జోడీగా న‌టిస్తోంది. మ‌రోవైపు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న `ఎఫ్ 3`లో న‌టిస్తోంది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ సైతం త‌మ‌న్నా చేతిలో ఉన్నాయి.

త‌మ‌న్నా ఆ వ్య‌క్తి చేతిలో దారుణంగా మోస‌పోయింద‌ని మీకు తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts