మంచు ఫ్యామిలీతో ఐశ్వర్య రాజేష్‌కు ఉన్న క‌నెక్ష‌న్ ఏంటో తెలుసా?

ఐశ్వ‌ర్య రాజేష్.. గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు అమ్మాయే అయిన‌ప్ప‌టికీ మొద‌ట త‌మిళంలో స్టార్ స్టేట‌స్‌ను సంపాదించుకున్న ఈ భామ‌.. వరల్డ్ ఫేమస్ లవర్, కౌసల్య కృష్ణమూర్తి వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింది. సీనియర్ నటుడు రాజేష్ కూతురైన ఐశ్వర్యకు.. లేడి కమెడియన్ శ్రీ‌లక్ష్మీ మేన‌త్త అవుతుంది.

సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఐశ్వ‌ర్య మాత్రం.. స్వయం కృషితో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. ఐశ్య‌ర్వ రాజేష్‌కి, మంచు మోహ‌న్ బాబు ఫ్యామిలీకి ఓ క‌నెక్ష‌న్ ఉంది. ఆ క‌నెక్ష‌న్ ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యార‌ట్‌లోకి వెళ్లాల్సిందే.

న‌టుడుగానే కాకుండా రాజ‌కీయ‌వేత్త‌గానూ స‌త్తా చాటిన మంచు మోహ‌న్ బాబు.. మ‌రోవైపు శ్రీ విద్యానికేతన్ స్కూల్‌ను స్థాపించి కులమతాలకు అతీతంగా 25 శాతం మందికి ఉచితంగా విద్యను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈయ‌న స్కూల్‌లో చ‌దువుకున్న విద్యార్థుల్లో ఐశ్వ‌ర్య రాజేష్ ఒక‌రు. అవ‌ను, శ్రీ విద్యానికేతన్ స్కూల్‌లోనే ఐశ్వ‌ర్య రాజేష్ చ‌దువుకుంది.

ఆ త‌ర్వాత న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో యాంకర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన ఐశ్వర్య రాజేష్.. కొన్నాళ్లకు హీరోయిన్ గా మంచి మంచి అవకాశాలను అందుకొని కోలీవుడ్ లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను సొంత చేసుకుంది. ఆ త‌ర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. గ్లామ‌ర్ విష‌యంలో హ‌ద్దులు దాట‌కుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోంది.

 

Share post:

Latest