అఖండ కోసం దిగుతున్న పుష్పరాజ్.. తగ్గేదే లే!

నందమూరి నటసింహం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను మాస్ చిత్రాల ఎక్స్‌పర్ట్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ క్రమంలోనే డిసెంబర్ 2న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎవరు వస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ఇప్పటికే అఖండ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడగా, ఇప్పుడు ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బన్నీ చీఫ్ గెస్ట్‌గా వస్తుండటంతో ఈ ఈవెంట్‌లో ఎలాంటి సందడి నెలకొంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక అఖండ గురించి బన్నీ ఏం మాట్లాడుతాడా అని కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో గతంలో బన్నీ ‘సరైనోడు’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే బోయపాటి రిక్వెస్ట్ మేరకు బన్నీ ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చేందుకు రెడీ అయ్యాడట. ఇక అఖండ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతుందా అని ప్రేక్షకులు అప్పుడే అంచనాలు వేస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరి బాలయ్య-బోయపాటి కాంబోలో రాబోయే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే డిసెంబర్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest