బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`లో మూడో గెస్ట్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతోంది. ఇప్ప‌టికే ఫ‌స్ట్ ఎపిసోడ్ కూడా పూర్తి అవ్వ‌డ‌గా.. మొట్టమొద‌ట‌ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, మంచు ల‌క్ష్మి, మంచు విష్ణులు స్పెష‌ల్‌గా గెస్ట్‌లుగా విచ్చేశారు.

- Advertisement -

Nandamuri Balakrishna's talk show Unstoppable with NBK to premiere on Nov 4, watch video | Entertainment News,The Indian Express

రెండో ఎపిసోడ్‌లో న్యాచుర‌ల్ స్టార్ నాని రాగా.. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఈ నెల 12న ఆహాలో స్ట్రీమ్ కాబోతోంది. ఇప్ప‌టికే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే, అన్‌స్టాబబుల్‌లో పాల్గొనే మూడో గెస్ట్ ఎవరన్న‌ దానిపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ న‌డుస్తుండ‌గా.. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రాబోతున్నార‌ని తాజా స‌మాచారం ద్వారా తెలుస్తోంది.

BRAHMANANDAM NET WORTH 2021

ఇక బ్రహ్మానందంతో ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా బాలకృష్ణ గత కొన్ని రోజుల క్రితం చేతికి సంబంధించి శస్త్రచికిత్స చేయించుకోవడం వల్లే ఆలస్యమైందంటూ వార్తలు వస్తున్నాయి. బాల‌య్య కోలుకోగానే ఆ ఎపిసోడ్‌కి సంబంధించిన షూట్‌ను కంప్లీట్ చేయ‌నున్నార‌ని టాక్‌. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.

Share post:

Popular