ఉత్కంఠ చెలరేగిన అనంతపురం సంఘటన..మాకేం తెలియదు అంటూ పోలీసులు..!!

అనంతపురం నగరంలో నిన్నటి రోజున ఎస్ ఎస్ బి ఎన్ కాలేజ్ లో విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. అయితే అందులో విద్యార్థి జయలక్ష్మి తలకు గాయం అయినట్లుగా సమాచారం. అది కూడా పోలీసులు లాఠీఛార్జి చేశారు అనే విషయం బాగా పాపులర్ అయ్యింది. అయితే అందుకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థి సంఘాలు విద్యార్థి సంస్థలకు బంద్ కు పిలుపునిచ్చాయి.

దీంతో ముందుగానే పలువురు విద్యార్థి సంఘం నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని రహస్య ప్రదేశంలో తరలించారు. మరొకవైపు నిన్న లాఠీఛార్జి తో గాయపడిన విద్యార్థి జయలక్ష్మి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తనకు ఏమీ తెలియదని అంటున్నారు. దీంతో తోటి విద్యార్థులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. అటు ఇంటి పరిసర ప్రాంతాలలో మఫ్టీలో స్పెషల్ పోలీసులు మోహరించారు.

అటు వైపు ఎవరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో ఆ చుట్టుపక్కల ఉంటున్న స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కాగా ssbn కాలేజీ యాజమాన్యం ఇవాళ రేపు సెలవు ప్రకటించడం జరిగింది.