`భీమ్లా నాయక్‌` నుంచి సిద్ధ‌మైన బ్లాస్టింగ్ అప్డేట్..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్ర `భీమ్లా నాయ‌క్‌`. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న‌ ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

Nithya Menen to play the female lead in Pawan Kalyan and Rana Daggubati's #PSPKRanaMovie - Movies News

ఇదిలా ఉంటే.. రేపు దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా భీమ్లా నాయ‌క్ నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతోంది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు. `బ్లాస్టింగ్‌ అప్‌డేట్‌ రెడీ అవుతుంది` అని ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్న‌ యూనిట్‌.. రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు ఆ అప్‌డేట్‌ విషయాలను పంచుకోనున్నామ‌ని తెలియ‌జేశారు.

Bheemla Nayak: That's how Pawan Kalyan and Rana Daggubati unwind, photo goes viral | Entertainment News,The Indian Express

దీంతో ఈ సారి భీమ్లా నాయ‌క్ నుంచి ఎలాంటి అప్‌డేట్ వ‌స్తుందా అని ఫ్యాన్స్ ఫు్ ఎగ్జైట్ అయిపోతున్నారు. కాగా, మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌బోతున్నారు.

Share post:

Popular