బిగ్‌బాస్ 5: ఈ వారం ఆ ఇద్ద‌రిలో ఒక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌డం ఫిక్స్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో ప‌ద‌కొండో వారం కొన‌సాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షోలో ఇంకా తొమ్మిది మందే మిగిలారు. అయితే 11వ వారం ప్రియాంక‌, ఆనీ మాస్ట‌ర్‌, సిరి, కాజ‌ల్‌, మాన‌స్‌, శ్రీ‌రామ్‌, ష‌న్ముఖ్‌, స‌న్నీలు నామినేట్ అయ్యారు.

- Advertisement -

Bigg boss 5 telugu 11th week nominated housemates #biggbosstelugu5, - YouTube

వీరిలో షణ్ముఖ్, సన్నీ, శ్రీ‌రామ్‌లు టాప్ ఓటింగ్‌తో ఎలాగో సేవ్ అవుతారు. అందులో ఎటువంటి సందేహ‌మూ లేదు. ఇక మానస్, కాజల్, సిరి లకు ఈవారం ఎలిమినేషన్ గండం లేనట్టే. మిగిలింది ఆనీ మాస్ట‌ర్‌, ప్రియాంక‌. ముఖ్యంగా ఆనీ మాస్టర్ తీరు ఇంటి స‌భ్యుల‌కే కాదు ప్రేక్ష‌కుల‌కూ న‌చ్చ‌డం లేదు. దీంతో యానీ ఎప్పుడెప్పుడు నామినేషన్స్‌లోకి వస్తుందా? ఆమెను ఎప్పుడెప్పుడు ఇంటి బాట ప‌ట్టిద్దామా..? అని ప్రేక్ష‌కులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

కాజల్ కాళ్లు మొక్కుతా.. అనీ మాస్టర్ కామెంట్స్ వైరల్

ఇక ప్రియాంక గేమ్‌ను ప‌క్క‌న పెట్టేసి త‌ర‌చూ మాన‌స్ చుట్టూనే తిరుగుతుండ‌టం ఆడియన్స్ కి చిరాకు ప‌ట్టిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే 11వ వారం ఆనీ మాస్ట‌ర్‌, ప్రియాంక‌ల‌లో ఒక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌డం ఫిక్స్ అని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share post:

Popular